Tuesday, January 21, 2025

మిత్రుడిని ఆదుకున్న పదో తరగతి స్నేహితులు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగరి: ఆత్మకూరు(యం) మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003వ సంవత్సరంలో తమతో కలిసి చదువుకున్న ఆత్మకూరు గ్రామానికి చెందిన బత్తిని మల్లేష్ గౌడ్ చాలా రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాదపడుతున్నాడు. విషయం తెలుసుకున్న నాటి విద్యార్థులు (రూ.50000) యాబై వేల రూపాయల నగదును అతని ఇంటివద్ద సోమవారం అందజేయడం జరిగింది. తమ మిత్రుడు త్వరగా పూర్తిగా కోలుకుని తమతో కలిసి ఉండాలని కోరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తామున్నామని బరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో తవిటి హరిబాబు, గట్టు శేఖర్, పోతగాని శ్రీను, శామల మల్లేష్, ఇంద్రపల్లి మహేష్, జోగు నరేష్, పరకాల సతీష్, యండి షానూర్, కసరబోయిన మల్లేష్, రాచమల్ల రవికుమార్ కొంగరి పరుశ రాములు పాల్గొన్నారు.

Also Read: తెలంగాణ బిడ్డ భారత్‌కు అంబాసిడర్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News