Monday, December 23, 2024

పదిలో 98.3 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

Tenth Class student pass with 98.3

మన తెలంగాణ/మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో పదో తరగతి ఫలితాల్లో ఉన్నత పాఠశాలల విద్యార్థులు 98.3శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఇఒ శ్రీధర్ తెలిపారు. మండలంలో 310 మంది విద్యార్థులు, 218 మంది విద్యార్థినులు పరీక్ష రాయగా 308 మంది విద్యార్థులు, 211 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థులు అనుదీప్, డి.చందన, వై.శ్రీలక్ష్మీ 10 జిపిఎ సాధించగా, మోత్కూరు ఉన్నత పాఠశాలకు చెందిన బి.శ్రీవర్ధిని, ఎం.దివ్య 9.7 జిపిఎ సాధించారని చెప్పారు. మోత్కూరు ఉన్నత పాఠశాలలో 97శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, 9.7 జిపిఎతో నలుగురు, 9.5 జిపిఎతో నలుగురు, 9.3తో ముగ్గురు, 9.2తో నలుగురు, 9 జిపిఎతో ఐదుగురు, 9జిపిఎపైన 20 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని హెచ్‌ఎం అంజయ్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News