- Advertisement -
వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను గురువారం నుంచి జారీ చేయనున్నారు. ఈ మేరకు హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి పొందవచ్చని చెప్పారు. గురువారం నుంచి విద్యాశాఖ వెబ్‌సైట్‌లో కూడా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి జూన్ 1 వరకు జరుగనున్న పదవ తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
- Advertisement -