- Advertisement -
వికారాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.పోమవారం వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ నెంబర్ వన్ స్కూల్ లో పరీక్ష ప్రారంభం అయిన 7 నిమిషాల్లోనే తెలుగు పేపర్ వాట్సాస్ గ్రూపుల్లో షేర్ అయ్యింది. వికారాబాద్ జిల్లాలో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. ప్రశ్నాపత్రం నఖిలీదా లేదా ఒరిజినల్ దా అధికారులు విచారణ ప్రారంభించారు.
కాగా లీకేజి కారణంగా అనుమానిస్తన్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఉపాధ్యాయుని ఫోన్ లో పదవ తరగతి ప్రశ్నపత్రం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ లీకేజి వెనుక ఉపాధ్యాయుడు ఒక్కరే ఉన్నారా?..ఇంకా ఎవరైనా ఉన్నారా ? అని పోలీసులు విచారాణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -