- Advertisement -
మూడో తరగతి చదుతున్న విద్యార్థి పట్ల పదోతరగతి విద్యార్థులు దారుణంగా ప్రవర్తించారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 24న టాయిలెట్ కు వెళ్లిన విద్యార్థి మర్మాంగానికి దారం కట్టి, అలాగే ఉంచుకోవాలని బెదిరించారు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తామని హెచ్చరించారు. నొప్పి భరించలేక రెండు రోజులు స్కూలుకు వెళ్లలేదు. ఆ తర్వాత స్నానం చేస్తుండగా దారం కట్టి ఉండడాన్ని గమనించిన తండ్రి బాలుడిని అడగడంతో అసలు విషయం బయటపడింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -