Thursday, January 16, 2025

భారీ వర్షానికి కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో కూలిన టెంట్లు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురుస్తున్న భారీ వర్షానికి కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో టెంట్లు కూలిపోయాయి. కరీంనగర్ జిల్లాలో మంగళవారం ఒక్కసారిగా ఈదులుగాలులతో కూడిన వర్షం రావడంతో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండులో జరగనున్న‌ కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో టెంట్లు.కుప్పకూలాయి. టెంట్ కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

అటు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షం పడింది. రంగారెడ్డి, భోంగీర్, మల్కాజిగిరి, జనగాం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంగళవారం ఉదయం అక్కడక్కడా వర్షాలు కురిసి ప్రజలకు కొంత ఊరటనిచ్చాయి. హైదరాబాద్‌లోని మారుమూల ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని దక్షిణ ప్రాంతంలోని దిల్‌సుఖ్‌నగర్, కాప్రా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, మలక్‌పేట్, గోషామహల్, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల్లో 3 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో ఎండలు చుక్కలు చూపించాయి. ఎండ తీవ్రత నుండి వర్షం హైదరాబాద్ ప్రజలకు ఉపశమనం కలిగించిందని నగర వాసులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News