- Advertisement -
అమరావతి: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నరికిచంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నెమలాం గ్రామానికి చెందిన కొనాం ప్రసాద్(30) అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ నెమలాం గ్రామంలోనే ఉంటున్నాడు. ప్రసాద్‌ను గురు తెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రసాద్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -