Friday, December 20, 2024

లోక్‌సభ ఎన్నికల సమయంలోనే పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ అవకాశాలను పరిశీలించేందుకు కేంద్రం కమిటీని నియమించడంతో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించడానికి వీలుగా లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరపవచ్చనే ఊహాగానాలకు తెరదీసింది. 1967 వరకు లోక్‌సభ ఎన్నికలతో పాటుగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగేవి. అయితే వివిధ కారణాల వల్ల ఆ తర్వాత ఇలా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు. అయితే గతంలో మాదిరి ఇప్పుడు జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా 2024 లోక్‌సభ ఎన్నికలు జరిగే సమయానికి కాస్త అటూ ఇటుగా కనీసం పది రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగియనుంది. అయిదు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగాల్సి ఉండగా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, జార్ఖండ్ అసెంబ్లీలకు లోక్‌సభ ఎన్నికలతో పాటుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

గడువు ముగియనున్న వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల జాబితా ఇలా ఉంది. మిజోరాం 2023 డిసెంబర్,చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ2024, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం2024 జూన్, హర్యానా, మహారాష్ట్ర2024 నవంబర్, జార్ఖండ్ 2024 డిసెంబర్, ఢిల్లీ2025 ఫిబ్రవరి, బీహార్ 2025 నవంబర్, అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్2026 మే, పుదుచ్చేరి 2026 జూన్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్– 2027 మార్చి, ఉత్తరప్రదేశ్ 2027, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్2027 డిసెంబర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర2028 మార్చి, కర్నాటక2028 మే. కాగా జము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం గడువు ఎప్పటికి ముగుస్తుందో ఇంకా స్పష్టత లేదు. 2018లో అప్పటి రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి జమ్మూ, కశ్మీర్ రాష్ట్రాన్ని మూడు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన విషయం తెలిసిందే. కాగా లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగించనుండగా, జమ్ము, కశ్మీర్‌లలో అసెంబ్లీఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. జమ్మూ, కశ్మీర్‌లలో ఎప్పుడైనా ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా తెలియజేసింది. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ చెప్పలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News