Wednesday, January 22, 2025

మిద్దెతోటల నిర్వహణకు మహిళలు ముందుకు రావాలి

- Advertisement -
- Advertisement -

మిద్దెతోటల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం.. శిక్షణ ఇస్తాం
మిద్దెతోటల అవార్డ్ కార్యక్రమంలో మంత్రి తుమ్మల

మన తెలంగాణ / హైదరాబాద్ : పసుపు,ఉప్పు,కారం తో పాటు అన్ని రకాల ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో ఈ కల్తీని అరికట్టేందుకు మిద్దేతోటల నిర్వహణకు మహిళామణులంత ముందుకు రావాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పిలుపునిచ్చారు. గురువారం రైతు నేస్తం ఫౌండేషన్ ఆద్వర్యంలో రెడ్ హిల్స్ లోని సురాన ఆడిటోరియంలో జరిగిన 2023- రైతు నేస్తం మిద్ధి తోట అవారడ్స్ కార్యక్రమానికి మంత్రి తుమ్మల ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రైతు నేస్తం తుమ్మేటి రఘోత్తం రెడ్డి మిద్దేతోట పురస్కారాలను మంత్రి ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మిద్దేతోటలకు సంబంధించి ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలను కొనసాగించే ప్రయత్నం చేస్తామని, వారికి నిరంతరం సలహాలు , శిక్షణ ఇచ్చే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ప్రారంభించిన రైతు నేస్తం కార్యక్రమంలో మిద్దేతోటలు అంశాన్ని కూడా చేర్చి ఆరోగ్య తెలంగాణకు కృషి చేస్తామని చెప్పారు. మహిళలంతా మిద్దేతోటలు మీద దృష్టి పెట్టి ఇంటిల్లిపాదికి అవసరమైన కూరగాయలు, పండ్లు పండిస్తూ తోటి వారికి పంచుతూ ముందుకు సాగాలని సూచించారు . ఈ సందర్భంగా రైతు నేస్తం వేంకటేశ్వర రావును అభినందిస్తూ అతని రైతు సేవా కార్యక్రమాలు మరింత గా విస్తరించాలని ఆశీర్వదించారు. రైతు నేస్తం పేరుతో రైతు వేదికలన్నింటిని సమన్వయపరుస్తూ, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో ప్రభుత్వం రైతుల సాగు సమస్యలకు పరిష్కారం చూపించే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించిందని మంత్రి పేర్కొన్నారు.

తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారాలను మొత్తం 24 మందికి అందజేశారు. కె. శ్రీనివాస్ ( ఖమ్మం), బి. మాధవి జొన్నాడ (అంబేద్కర్ కోనసీమ జిల్లా ), బండి మల్లేశ్వరి ( సంగారెడ్డి ), బి. శివరాణి మొవ్వ (కృష్ణా జిల్లా ), కె. బాల్‌రెడి ్డ(భువనగిరి), కె. సామ్రాజ్యం (విజయవాడ), ఎం. దివ్య (శంషాబాద్ ), వై. శేషకుమారి ( రాజమండ్రి ), స్వరూప ( టెర్రస్ గార్డెన్, ఉద్యానశాఖ, హైదరాబాద్), డి. ప్రియబాంధవి (విశాఖపట్నం), సివిఎల్. నరసింహారావు (చీర్యాల, సికిందరాబాద్ ), విజయల (ఒంగోలు), ఎం. ప్రేమ్‌రాయ్ (మల్కాజ్‌గిరి, సికిందరాబాద్ ), డి. శ్రీదేవి (విజయవాడ), ఎన్. రాజ్‌వర్థన్ (శంషీగూడ, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ), షేక్ కైసరీ బేగం (ఖమ్మం ), ఎం. ఐశ్వర్య (గాజువాక, విశాఖపట్నం), డి. లక్ష్మి రెడ్డి (కావలి ), టి. అప్పారావు (అమీర్‌పేట్, హైదరాబాద్), జి. మంజుల ( నెల్లూరు ), ఇమ్మడిశెట్టి ప్రభాకర్‌రావు (హన్మకొండ ), వాణి (గుంటూరు ), కె. ఎలిజబెత్ (నాగారం, హైదరాబాద్), మలిశెట్టి శ్రీదేవి (కాకినాడ) తదితరులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం. కోదండరెడ్డి, రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు, ఆత్మీయ అతిథిగా ప్రముఖ మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మరో మిద్దెతోట నిపుణురాలు పిన్నక పద్మ తోపాటు ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు.

Rythu Nestham 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News