తెంపీ: రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొని 32 మంది మృతి చెందిన సంఘటన గ్రీస్‌లో జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం రాత్రి సమయంలో రైలు ఏథెన్స్ నుంచి థెస్కాకు వెళ్తుండగా కార్గో రైలును బలంగా ఢీకొట్టడంతో మూడు బోగీలు దగ్ధమయ్యాయి. బోగీలు మంటల్లో చిక్కుకపోవడంతో 32 మంది సజీవదహనంకాగా 85 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైలులో దాదాపుగా 350 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి సంబందించిన విషయాలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. ఒక్కసారిగా భూకంపం వచ్చిందని భయపడ్డామని ప్రయాణికులు తెలిపారు. కొందరు ప్రయాణికులు రైళ్లో నుంచి బయటకు దూకారు.
A terrible collision between a passenger train and a freight train in Greece 29 people died, 85 others injured..#greece #died #terriblecollision #passengertrain #Goodstrain #injured #people #LatestNews #metrotimes pic.twitter.com/oG1uvYOdDU
— Metro Times (@CamLivetv) March 1, 2023