Saturday, December 21, 2024

నైజీరియాలో ఘోరం.. 47 మందిని కాల్చి చంపేశారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దుండగులు నరమేధానికి పాల్పడి 47 మందిని కాల్చి చంపిన ఘటన నైజీరియాలోని బెన్యూ రాష్ట్రం ఉమోగిడిలో చోటు చేసుకుంది. కొందరు సాయుధులు ఓ మార్కెట్ లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారితో సహా 47మంది మరణించారు. కాగా ఉత్తర-మధ్య నైజీరియాలో భూ వివాదాలపై గతంలో రైతులతో ఘర్షణ పడిన స్థానిక పశువుల కాపరులపై అనుమానం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలోను నైజీరియాలో ఇలాంటి దాడులు జరిగాయి. పశువుల కాపరులు తమ పొలాల్లో తమ పశువులను మేపుతున్నారని, ఈ కారణంగా తమ పంటలు పాడైపోయి నష్టం వస్తుందని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1965లో తొలిసారిగా చట్టం ద్వారా ఆ భూములు మేత దారులవేనని పశువుల కాపరులు తెలిపారు. దీంతో వీరి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బెన్యూ రాష్ట్రాన్ని “నైజీరియా ఆహార బుట్ట”గా అక్కడి ప్రజలు పిలుస్తారు. ఆ ప్రాంతంలో పంటలు సమృద్దిగా పండుతాయి. అయితే తరచుగా జరిగే ఈ ఘర్షణల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతం నుంచి వ్యవసాయ దిగుబడులు తగ్గిపోతోంది. దీంతో ఆకలితో అలమటించే పేద ప్రజలను ఈ పరిస్థితి మరింత కుంగదీస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News