Monday, January 20, 2025

ఓవర్‌స్పీ‘ఢీ’

- Advertisement -
- Advertisement -

ట్రాలీ ఆటో, లారీ ప్రమాదంలో
8మంది దుర్మరణం

కామారెడ్డి
జిల్లా
అన్నసాగర్
తండా వద్ద
ఘోర
దుర్ఘటన

మన తెలంగాణ/ఎల్లారెడ్డి/నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా అన్నసాగర్ తండా వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న ట్రాలీ ఆటో.. లారీ వేగంగా వచ్చిఢీ ఎని మిది మంది దుర్మరణం పాలవ్వగా, మరో 18 మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదంలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ఒకే గ్రామానికి చెందిన 25 మంది ప్రయాణిస్తున్నారు. ఇందుకు సంబంధించి గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంధువు దశదిన కర్మలో భాగంగా అంగడి తిప్పే కార్యక్రమానికి వెళ్లి వీరంతా అసువులు బాశారు. అనాదిగా వస్తున్న ఆచారమే వారి ఇళ్లలో విషాదం నింపింది. ప్రమాదంలో మృతిచెందిన వారంతా పిట్లం మండల చిల్లర్గి గ్రామానికి చెందిన వారు. చిల్లర్గి గ్రామానికి చెందిన మానయ్య అనే వ్యక్తి ఇటీవల మృతి చెందగా.. వారి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఎల్లారెడ్డి అంగడికి వచ్చి పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి 25మందితో ఆటోలో తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

ఎల్లారెడ్డి నుంచి బయలుదేరిన ఆటో మండలంలోని అన్నసాగర్ తండా వద్ద ధాన్యం లోడుతో ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొంది. ఘటనా స్థలిలోనే తుగ్గలి గ్రామానికి చెందిన డ్రైవర్ సాయిలు(25), చిల్లర్గి గ్రామానికి చెందిన సదర్‌పల్లి లచ్చవ్వ(65) మృతి చెందారు. కాగా, ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో మురగల్ల అంజవ్వ(35), బాన్సువాడ ఆసుపత్రిలో సాయవ్వ(40), లక్ష్మి(45), నిజామాబాద్ ఆస్పత్రిలో వీరవ్వ(70), ఎల్లయ్య(42) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పోచయ్య, లక్ష్మి, సాయిరాం, బాలయ్య, సాయిబాబా, గంగవ్వ, సాయవ్వ, దేవవ్వ, మానవ్వ, సాయిలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి మరో పదిమంది క్షతగాత్రులను తరలించారు. అక్కడ తరలించిన వారిలో ఎనిమిది మందిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఇద్దరిని బాన్సువాడలో ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆటోలో పరిమితికి మించి ఉండడం, డ్రైవర్‌తో సహా అందరూ మద్యం సేవించినట్లు సమాచారం. దీంతో ప్రమాదంలో తీవ్రత పెరిగి ఐదుగురు మృతికి కారణమైనట్లు తెలుస్తోంది.

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చి సహాయక చర్యలు చేపట్టారు. వారందరినీ అంబులెన్స్‌లో పోలీసులు తరలించారు. పెను ప్రమాదం జరగడం పట్ల గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీను వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా, లారీ సమీపంలోని ఇంటిలోకి దూసుకుపోయి నిలించిపోయింది. స్థానిక సిఐ శ్రీనివాస్, ఎస్సై గణేష్ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News