- Advertisement -
మేడ్చల్ మల్కాజ్‌గిరి : కొంపల్లిలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను షకీర్(30), అఫ్సర్(55)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఇద్దరు వ్యక్తులు తుఫ్రాన్ నుంచి గుడిమల్కాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
- Advertisement -