Thursday, January 2, 2025

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Terrible road accident in Srikalahasti

అమరావతి : శ్రీకాళహస్తి శివారులోని పూతలపట్టు – నాయుడుపేట రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుప్రతికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. చంద్రగిరికి చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలోని కనువూరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరిగి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో రేణిగుంట-నాయుడుపేట ప్రధాన రహదారిపై శ్రీకాళహస్తి అర్ధనారీశ్వరస్వామి ఆలయం దగ్గరలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో అర్జునయ్య, నరసమ్మ దంపతులతోపాటు మారెమ్మ అలియాస్‌ కావ్య అక్కడికక్కడే ప్రాణాలు మృతి చెందారు. నలుగురు చిన్నారులతో పాటు పలువురు గాయపడగా.. వీరందరినీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News