Thursday, January 23, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మున్సిపల్ కార్మికుల మృతి(వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మెదక్ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున సుమారు 5 గంటలకు పారిశుధ్య పనుల నిమిత్తం విధులకు వచ్చిన 5మంది పారిశుధ్య కార్మికులను రాందాస్ చౌరస్తా నుండి వేగంగా వస్తున్న టిఎస్ 35 ఎఫ్ 9766 ఆల్టో కారు ఢీకొట్టడంతో దాయర వీధి కి చెందిన నర్సమ్మ అక్కడికి అక్కడే మృతి చెందింది. చికిత్స నిమిత్తం హాస్పటల్ కి తరలించడంతో చికిత్స పొందుతూ యాదమ్మ అనే మహిళ మృతి చెందగా మరో ముగ్గురు ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు డిఎస్పి. సైదులు పట్టణ సిఐ మధు మరియు రూరల్ సిఐ విజయకుమార్ ఎస్ మల్లారెడ్డి, మరియు ఎస్ విట్టల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒకేసారి ఇద్దరు మున్సిపల్ కార్మికులు చనిపోవడంతో మున్సిపల్ సిబ్బంది మరియు కార్మికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగుడారు .. బాధితులకు న్యాయం చేయాలని పోలీసులని కోరడమైనది. ప్రమాదానికి కారణం అయిన కార్ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని కార్ ని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News