Sunday, December 22, 2024

భారీ యాక్షన్ స్టంట్స్.. పైరేట్ తరహా థీమ్‌తో తారక్ ఎంట్రీ!

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ ప్రతిష్టాత్మక మూవీ ‘వార్- 2’ కోసం ఉత్తరాది ప్రేక్షకులతో పాటు దక్షిణాది ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను యశ్ రాజ్ స్పై యూనివర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ స్ట్రెయిట్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో తారక్ అభిమానులు ఈ సినిమాలో ఆయన నటన ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘వార్ -2’ మూవీలో తారక్ ఎంట్రీ సీన్ గురించి తాజాగా బి-టౌన్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో పైరేట్ తరహా థీమ్‌తో తారక్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్‌లో భారీ యాక్షన్ డోస్ ఉండనుందని.. తారక్ చేసే స్టంట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో తారక్ ఫేస్ టు ఫేస్ సీన్స్ అయితే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించబోతున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను 2025 ఆగస్టు 14న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News