Monday, December 23, 2024

బుర్జు ఖలీఫా మాయం

- Advertisement -
- Advertisement -

Terrific Sandstorm in Dubai

దుబాయ్‌లో ఇసుకతుపాన్ విలయం

దుబాయ్ : ప్రపంచపు అతి పొడవైన భవనరాజం బుర్జు ఖలీఫా బుధవారం చాలా సేపటి వరకూ కంటికి కన్పించకుండా పోయింది. అయితే ఇదేం మాయం కాలేదు. స్థానచలనం జరగలేదు. మిడిలిస్టు అంతటా తీవ్రస్థాయిలో చెలరేగిన ఇసుకతుపాన్‌ల కారణంగా చెలరేగిన దట్టమైన దుమ్ముధూళితో ఈ కట్టడం అంతా చాలా సేపటివరకూ ఉదారంగు తెరలవెనకకు వెళ్లింది. దీనితో ఎంతో వైభవంగా కన్పించే ఈ బుర్జు రూపం గోచరించని స్థితికి చేరింది. 828 మీటర్లు ( దాదాపు 2716 అడుగులు పైగా) ఉండే బుర్జు ఖలీఫా దుబాయ్‌లో ఎక్కడి నుంచి అయినా కన్పించే అతి పొడవైన కట్టడంగా నిలిచింది. సౌదీ, కువైట్, ఇరాక్, ఇరాన్ ఇతర ప్రాంతాలను ఇటీవలి కాలంలో వాతావరణ తీవ్రస్థాయి మార్పులతో వరుసగా ఇసుకతుపాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్ కూడా ఇసుకతుపాన్ల తాకిడికి గురైంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో పలు ప్రాంతాలో ఎయిర్‌పోర్టులు, స్కూళ్లు మూతపడ్డాయి. తీవ్ర ఇసుక తుఫాన్ గాలులతో వేలాది మందికి శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనితో పలు ఆసుపత్రులకు వీరికి తక్షణ చికిత్సకు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పంపిస్తోంది. అబూధాబిలో వాయు ప్రమాణాల సూచీ (ఎక్యూఐ) ఇప్పుడు విషమ స్థాయికి చేరుకుందని కాలుష్య సంబంధిత సమాచార వేదికలు వాకీ. ఇన్‌ఫో, ప్లుమే పొల్యూషన్ యాప్‌లు తెలిపాయి. పలు ప్రాంతాలలో అడవుల నాశనం, నదుల నీటిని ఎక్కువగా వాడటం , ఎక్కువగా డ్యామ్‌లు నిర్మించడం వంటి పరిణామాలతో మధ్య ప్రాచ్యం అంతటా ఇప్పుడు విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇసుకతుపాన్లు తరచూ సంభవిస్తున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇసుకతుపాన్లు మరింతగా చెలరేగే ప్రమాదం ఉందని ఎమిరైట్ అధికారులు దేశవ్యాప్త హెచ్చరికలు వెలువరించారు. రోడ్లపై వాహనాలలో వెళ్లే వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని దుమ్ము పేరుకుపోయి ఉన్నందున రాదార్లపై దృశ్యగోచరత ఇబ్బందికరం అవుతుందని తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఇసుక తుపాన్లు వీస్తున్నాయి. దీనితో రోడ్లపై రెండువేల మీటర్ల పరిధిలోని వాహనాలు కూడా కన్పించని స్థితి ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News