Wednesday, January 22, 2025

ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు మృత్యువాత..

- Advertisement -
- Advertisement -

రాజౌరి: కాశ్మీర్లోని రాజౌరిలో ఉగ్రవాదులు పెచ్చరిల్లిపోయారు. 14గంటల వ్యవధిలో రెండుసార్లు దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు చిన్నారులుతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఎల్‌ఇడి పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు ఉపయోగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆదివారం రాత్రి ఉగ్రవాదులు డాంగ్రి గ్రామంలోని మూడుఇళ్లపై కాల్పులు జరిపి పేలుళ్లకు పాల్పడటంతో శాన్విశర్మ(7) బాలిక సోదరుడు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరో నలుగురు పౌరులు చనిపోగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ఆదివారం సాయంత్రం ప్రీతమ్‌లాల్ నివాసం వద్ద బాంబు పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో లాల్ బంధువులుతోపాటు చాలామంది ఉన్నారని వెల్లడించారు. ఉగ్రదాడి అనంతరం రాజౌరీ పట్టణంతోపాటు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ప్రాంతాన్ని దిల్‌బాగ్ సింగ్ సందర్శించి వివరాలు సేకరించారు. సీనియర్ అధికారులను లక్షంగా చేసుకుని ఎల్‌ఇడి బ్లాస్ట్ జరిగిందని డిజిపి మీడియాకు తెలిపారు.

గ్రామ రక్షణ కమిటీలు (విసిడిలు) పునరుద్ధరించనున్నామని వారికి తిరిగి ఆయుధాలను సమకూర్చుతామని డిజిపి ప్రకటించారు. కాగా విసిడిల నుంచి అధికారులు ఆయుధాలు తీసుకోవడం వల్లనే ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారని ఆందోళనకారులు తెలిపారు. స్థానిక సీనియర్ బిజెపి నేత, మాజీ ఎంఎల్‌సి గుప్తా మాట్లాడుతూ 60శాతం తుపాకులను విసిడిలనుంచి వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి 1990లో గ్రామస్థులకు శిక్షణనిచ్చి డిఫెన్స్ కమిటీలు(విడిసిలు)ను ఏరాటు చేశారు. వీరిని స్పెషల్ ఆఫీసర్లుగా పరిగణిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News