- Advertisement -
మాస్కో: రష్యాలోని దగేస్థాన్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. రెండు చర్చిలు, ఓ యూదుల ప్రార్థనామందిరాలు, పోలీసుల పోస్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో 15 మందికిపైగా చనిపోయారు. వారిలో పోలీసులతోపాటు పలువురు పౌరులు ఉన్నారని దగేస్థాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ వెల్లడించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆయన వెల్లడించారు.
భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మఖచ్‌కల డెర్బెంట్ నగరాల్లోని చర్చీలు, ప్రార్థనా మందిరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపట్టాయి. ప్రస్తుతానికి ఆపరేషన్ ముగిసినట్లు రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది.
- Advertisement -