Sunday, January 19, 2025

అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తాం: రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

జమ్మూ : జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో క్రితం వారం విగత జీవులుగా కనిపించిన ముగ్గురు పౌరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం హామీ ఇచ్చారు. పూంచ్ జిల్లాలో రెండు సైనిక వాహనాలపై మాటు నుంచి ఉగ్రవాదులు దాడి జరిపిన తరువాత సైన్యం ఆ ముగ్గురిని నిర్బంధించిన తరువాత వారు విగత జీవులుగా కనిపించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలసి బుధవారం మధ్యాహ్నం రాజౌరి జిల్లా చేరుకున్న మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మృతుల కుటుంబాలను కలుసుకున్నారు. ‘చిత్రవధ’కు గురైన ఇతర బాధితులు నలుగురి ఆరోగ్యం గురించి వాకబు చేయడానికి ఆయన ఆ తరువాత ప్రభుత్వ వైద్య కళాశాల (జిఎంసి)ని సందర్శించారు. రక్షణ శాఖ మంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్, మృతుల కుటుంబాల మధ్య జరిగిన సమావేశానికి పలువురు జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) సభ్యులు, మాజీ శాసనసభ్యులు,

పౌర సమాజం సభ్యులు కూడా హాజరైనారు. జిఎంసి ఆసుపత్రిలో విలేకరులతో మంత్రి మాట్లాడుతూ, ‘జరిగింది ఏదైనా న్యాయం చేస్తాం’ అని చెప్పారు. ఈ నెల ౨౧న పూంచ్‌లో సురాన్‌కోట్ ప్రాంతంలో ధత్యార్ మోఢ్ వద్ద ఉగ్ర మూకలు సైనిక వాహనాలపై మాటు నుంచి దాడి చేసినప్పుడు నలుగురు జవాన్లు హతులు కాగా, మరి ముగ్గురు క్షతగాత్రులు అయ్యారు. ఆ దాడి అనంతరం సైన్యం ముగ్గురు పౌరులు సఫీర్ హుస్తేన్ (43), మహ్మద్ షౌకత్ (27), షబ్బీర్ అహ్మద్ (32) అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు 22 విగత జీవులుగా కనిపించారు. ఆ నిర్బంధిత పౌరులను చిత్ర హింసలకు గురి చేసినట్లుగా పేర్కొంటున్న వీడియో క్లిప్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
౦౦౦౦౦౦

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News