Sunday, December 22, 2024

పోలీసులే లక్ష్యంగా ఉగ్రదాడులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. కరాచీ పోలీసు కార్యాలయంపై పాకిస్థాన్ తాలిబన్ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో స్థానికంగా ఉండే ఇద్దరు పౌరులతో సహా 9 మంది మృతి చెందారు, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఐదుగురు ఉగ్రవాదులు, ఇద్దరు పోలీసులు ఉన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News