- Advertisement -
ఆంధ్రప్రదేశ్ లోని మన్యం జిల్లా భామిని మండలం తాలాడలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ముగ్గరు వ్యక్తుల పై గజరాజులు దాడి చేశాయి. ఈ దాడిలో ఒక రైతుకు తీవ్ర గాయాలు అయ్యి మృతి చెందగా ఇద్దరు మహిళలకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఏనుగుల దాడితో తలాడ గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామస్థులు అటవి శాఖ అధికారులతో సమాచారం ఇవ్వడంతో అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు ఏనుగులను బంధించించాలని అధికారులను కోరారు.
- Advertisement -