Sunday, January 19, 2025

దారి దోపిడి దొంగల భీభత్సం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : హైదరబాద్ నార్సింగ్‌లో అర్దరాత్రిరి దారి దోపిడి దొంగలు ఘాతుకానికి ఒడిగట్టారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై దొంగలు తల్వార్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. రక్త మైసమ్మ దేవాలయ సమీపంలో దారికాచిన దోపిడీ దొంగలు  ద్విచక్రవాహనం పై ఉన్న కిశోర్ కుమార్ రెడ్డి, తులసి అనే ఇద్దరిపై  విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు. దాడిలో గాయపడిన కిషోర్ ఘటన స్థలంలోనే మరణించారు. దోపిడి దొంగల కత్తిపోట్ల నుంచి తప్పించుకున్న తులసి దాడిలో చేయి నాలుగు వేళ్లు కోల్పోయింది . తులసి వద్ద ఉన్న రూ. 15 వేలు దొంగిలించారు. ముఠా నుంచి ఆమె తప్పించుకుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News