Monday, December 23, 2024

బెంగళూరులో ఉగ్రదాడుల కుట్ర.. భగ్నం చేసిన పోలీస్‌లు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఉగ్రదాడులకు జరుగుతోన్న కుట్రలను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ భగ్నం చేసింది. ఐదుగురు అనుమానితులను అసరెస్టు చేశారు. వీరి దగ్గర ఉన్న పేలుడు పదార్థాలు, ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ సుహేల్, ఉమర్, జునెయిద్, ముదసిర్, జాహిద్ అనే అనుమానితులను అరెస్టు చేయగా, మరో ఐదుగురు అనుమానితుల కోసం లుకౌట్ నోటీస్‌లు జారీ చేశారు.

బెంగళూరు లోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని సీసీబీ కి సమాచారం అందింది. ఈ క్రమంలోఅరెస్టులు జరిగాయి. ప్రస్తుతం సీసీబీ అదుపులో ఉన్నవ్యక్తులకు 2017 లో జరిగిన ఓ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఆ కేసులో బెంగళూరు లోని సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో వారికి ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని, పేలుడు పదార్ధాల వాడకంలో శిక్షణ పొందారని తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News