Wednesday, January 22, 2025

ఆసియా, ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఉగ్రవాదం: జైశంకర్

- Advertisement -
- Advertisement -

UN meet-Jaishanker

న్యూ ఢిల్లీ: ఉగ్రవాదం ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలో విస్తరిస్తోందని విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ శనివారం తెలిపారు. ‘ఉగ్రవాదం అన్నది మానవాళికి గొప్ప ముప్పు’ అన్నారు. న్యూఢిల్లీలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రెండు రోజుల ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. కౌంటర్ టెర్రరిజం కమిటీ(సిటిసి) రెండు రోజుల సమావేశానికి భారత్ అధ్యక్షత వహించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం అన్నది భద్రతా మండలి ముఖ్యాంశంగా మారిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నవీన సాంకేతికత ప్రభుత్వాలకు కొత్త సవాళ్లను కూడా విసురుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాజ్యేతర శక్తులు ఉగ్రవాదంలో క్రియాశీలకంగా ఉన్నాయన్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటివి ఉగ్రవాదులకు పనిముట్లుగా మారాయని ఆయన విమర్శించారు. ఈ ఏడాది ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు యుఎన్ ట్రస్ట్ ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజంకు భారత్ స్వచ్ఛందంగా అర మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు జయశంకర్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News