Thursday, January 30, 2025

ముంబయి ఉగ్ర దాడి కుట్రదారు అబ్దుల్ మక్కి మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి ఉగ్ర దాడి సూత్రధారులు హఫీజ్ సయీద్ బావ మరిది, నిషిద్ధ లష్కర్ ఎ తయ్యిబా (ఎల్‌ఇటి) డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కి గుండెపోటులో శుక్రవారం లాహోర్‌లో మరణించాడు. ఎల్‌ఇటి సమాచారం ప్రకారం, అబ్దుల్ రెహ్మాన్ మక్కి కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధ పడుతున్నాడు. తీవ్ర మధుమేహ వ్యాధికి లాహోర్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ‘మక్కికి శుక్రవారం తెల్లవారు జామున గుండెపోటు వచ్చింది. అతను ఆసుపత్రిలో మృతి చెందాడు’ అని జెయుడి అధికారి ఒకరు పిటిఐతో చెప్పారు. ఉగ్ర నిరోధక కోర్టు మక్కికి 2020లో ఉగ్ర నిధుల కేసులో ఆరు మాసాల కారాగార శిక్ష విధించింది. మక్కిని 2023లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఉగ్రవాదిగా ముద్ర వేసింది. అతని అస్తులను స్తంభింపచేయాలని, ప్రయాణాలకు అనుమతించరాదని సమితి ఆదేశించి, అతనిపై ఆయుధాలపై ఆంక్షలు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News