- Advertisement -
ఇంఫాల్ : మణిపూర్ మరోసారి రగులుకుంది. అనుమానిత మిలిటెంట్లు ఈసారి ఏకంగా భద్రతా బలగాలపై దాడికి దిగారు. వీరు జరిపిన దాడిలో ఓ జవాను గాయపడ్డాడు. రాష్ట్రంలోని తెంగనౌపాయ్ జిల్లాలోని మోరేహ్ పట్టణం వద్ద మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. మే నెల 3వ తేదీ నుంచి మణిపూర్ తెగల నడుమ సంకుల సమరంతో రగులుతోంది. శనివారం మధ్యాహ్నం మిలిటెంట్లు మెరుపుదాడికి దిగారు. మందుపాతరలు పేల్చడం, కాల్పులకు దిగడంతో ఈ ప్రాంతంలో చాలా సేపటివరకూ ఉద్రిక్తత ఏర్పడింది. భద్రతా బలగాల నుంచి కూడా సాయుధులపై ఎదురుదాడి జరిగింది. పరస్పర కాల్పులు జరిగాయి. దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
- Advertisement -