Thursday, January 23, 2025

రష్యాలో ఉగ్రదాడి..15 మంది పోలీస్‌ల మృతి

- Advertisement -
- Advertisement -

రష్యా లోని డాగేస్థాన్‌లో ఆదివారం సాయుధులైన మిలిటెంట్లు దారుణానికి పాల్పడ్డారు. రెండుచర్చిలు, ఓ యూదుల ప్రార్ధనా మందిరం, పోలీస్‌ల పోస్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 15 మంది పోలీస్‌లు సహా పలువురు సామాన్య పౌరులు మరణించినట్టు డాగేస్థాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ సోమవారం వెల్లడించారు. మఖచ్‌కల , డెర్బెంట్ నగరాల్లోని చర్చిలు, ప్రార్థనా మందిరాలను మిలిటెంట్లు లక్షంగా చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ను చేపట్టాయి. ఆరుగురు సాయుధులను మట్టుబెట్టాయి. ప్రస్తుతానికి ఆపరేషన్ ముగిసినట్టు రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ ( ఎన్‌ఎసి) ప్రకటించింది. ఈ సంఘటనను

ఉగ్రవాదుల చర్యగా పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితులు అదుపు లోకి వచ్చాయని తెలిపింది. సంఘటన జరిగిన ప్రాంతాలు పూర్తిగా భద్రతా బలగాల అధీనంలో ఉన్నట్టు వెల్లడించింది. ముస్లింలు అధికంగా నివసించేఈ ప్రాంతంలో గతంలోనూ సాయుధులు కాల్పులకు తెగబడ్డ సందర్భాలు ఉన్నాయి. డాగేస్థాన్‌లో జూన్ 24, 25, 26 సంతాప దినాలుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.దాడికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. గత మార్చిలో సాయుధులైన దుండగులు మాస్కో సబర్బన్ ప్రాంతంలో ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొన్న జనసమూహంపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.న అప్పటి కాల్పుల్లో 145 మంది మరణించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆ దాడికి బాధ్యతగా ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News