- Advertisement -
పేషావర్: వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులో శుక్రవారం జడ్జీల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో జడ్జీలకు భద్రతగా ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ కాల్పుల పోరు నుంచి ముగ్గురు న్యాయమూర్తులు సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.
విధులు ముగించుకుని ట్యాంక్ జిల్లా కోర్టుల నుంచి డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని తమ నివాసాలకు బయల్దేరిన జడ్జీల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో జడ్జీలకు రక్షణగా ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. కాగా..జడ్జీల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ప్రావిన్సు ముఖ్యమంత్రి అలీ అమీన్ గందపూర్ ఖండించారు.
- Advertisement -