- Advertisement -
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ మృతి చెందాడు. చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న సయ్యద్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా నెల రోజుల క్రితం సయ్యద్ కు గుండె ఆపరేషన్ అయ్యింది. ఈ క్రమంలో మూత్ర పిండాలు దెబ్బ తిని ఆరోగ్యం క్షీణించింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు చర్లపల్లి జైలు అధికారులు వెల్లడించారు.
- Advertisement -