Wednesday, January 22, 2025

సైనిక వాహనాలపై ఉగ్రవాదుల కాల్పులు

- Advertisement -
- Advertisement -

జమ్మూ: జమ్మూ కశ్మీరులోని పూంచ్ జిల్లాలో శనివారం భారత వైమానిక దళం(ఐఎఎఫ్)కు చెందిన ఒక వాహనంతోసహా రెండు వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. సూరన్‌కోటె ప్రాంతంలోని సనాయ్ టాప్‌కు వెళుతున్న వాహనాలపై శశిధర్ సమీపంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు.

ఈ కాల్పులలో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News