Wednesday, January 8, 2025

తిరుమలలో ఉగ్రవాదులున్నట్లు పోలీసులకు మెయిల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుమలలో ఉగ్రవాదులున్నట్లు పోలీసులకు మెయిల్ చేశారు. తిరుపతి ఎస్‌పి పరమేశ్వర్ రెడ్డి మెయిల్ విషయమై స్పందించారు. మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చిందన్నారు. మెయిల్‌తో అప్రమత్తమై తిరుమలలో పరిశీలించామన్నారు. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల కదలికలు లేవన్నారు. ఆకతాయి మెయిల్‌గా భావిస్తున్నామని ఎస్‌పి పేర్కొన్నారు. మెయిల్ విషయమై విచారణ జరుపుతున్నామని, భక్తుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తిరుమలలో ఎలాంటి హైఅలర్ట్ లేదని వివరించారు.

Also Read: ఢిల్లీకి సవాల్.. నేడు టైటాన్స్‌తో పోరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News