- Advertisement -
శ్రీనగర్: పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్ అంతటా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టారు. ఉగ్రమూకల కోసం రాష్ట్రమంతటా జల్లెడపడుతున్నాయి. తాజాగా లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లిల్లీని భద్రత బలగాలు మట్టుబెట్టాయి. బందీపొరాలో అల్తాఫ్ ఉన్నట్లు సమాచారం తెలిసింది. దీంతో శుక్రవారం ఉదయం ఆర్మీ-పోలీసులు జంటగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ముందు ఓ ఉగ్రవాది ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డాడు. ఆ తర్వాత భద్రతా బలగాల్లో ఓ అధికారికి బులెట్ తగిలింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు అల్తాఫ్‌ను మట్టుబెట్టాయి.
- Advertisement -