Monday, December 23, 2024

పాక్ లో మరో ఉగ్రవాది కాల్చివేత

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ లో మరో ఉగ్రవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. జైషే మహ్మద్ టాప్ కమాండర్ మసూద్ అజార్ అనుచరుడు రహీముల్లా తారిఖ్ ను కరాచీలోని ఓరంగి టౌన్ అనే ప్రాంతంలో దారుణంగా హతమార్చారు. ఈ నెలలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇది మూడోసారి. దుండగులు తారిఖ్ పై అతి సమీపంలోంచి కాల్పులు జరిపారని, తారిఖ్ అక్కడికక్కడే మరణించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

పదిరోజుల క్రితం లష్కరే తోయిబా కమాండర్ అక్రమ్ ఘాజీని, అంతకుముందు అదే ఉగ్రవాద సంస్థకు చెందిన ఖ్వాజా షాహిద్ నీ గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. జేషే మహ్మద్ ముఠా సభ్యుల మధ్య నెలకొన్న అంతర్గత కలహాలే తారిఖ్ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News