శ్రీనగర్: మూడు దశాబ్దాల క్రితం కశ్మీరీ పండిట్లపై జరిగిన ‘నదీమార్గ్’ దాడిలో ప్రధాన సూత్రధారి అయిన లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుఢు జియా ముస్తషా తాజా ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో రెండు వారాలుగా ఉగ్రమూకలకు భారత జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముస్తఫా మరణించినట్లు భారత జవాన్లు తెలిపారు.
2003లో అరెస్టయిన ముస్తఫాను శనివారమే పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆదివారం అతడిని బాతా దరియా వద్ద ఎన్‌కౌంటర్ ప్రదేశానికి తీసుకువెళ్లగా, దళాల రాకను గుర్తించిన ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కొంత మంది జవాన్లు సహా జియా గాయపడ్డాడు. అయితే అతడిని అక్కడి నుంచి తీసుకువచ్చేందుకు దళాలు చేసి ప్రయత్నం ఫలించలేదు. ఘటనాస్థలిలోనే అతడు మరణించినట్లు జవాన్లు తెలిపారు.