Tuesday, December 24, 2024

ఎస్‌ఐని కాల్చి చంపిన ముష్కరులు

- Advertisement -
- Advertisement -

Terrorist shot Sub Inspector

 

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా పంపారో ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సంబూరాలోని ఎస్‌ఐ ఫరూఖ్ అహ్మద్ మీర్ ఇంట్లోకి వెళ్లి అతడిని తీవ్రవాదులు కాల్చి చంపారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపు తట్టారు. డోర్ ఓపెన్ చేయగానే అతడిపై ముష్కరులు బుల్లెట్ల వర్షం కురుపించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఐఆర్‌పి 23వ బెటాలియన్‌లో అతడు ఎస్‌ఐగా పని చేస్తున్నాడు. ముష్కరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News