Monday, December 23, 2024

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఐదుగురు సైనికులు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

పూంచ్ : జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు సజీవదహనం అయి మృతి చెందారు. మరొక్కరు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ ప్రాంతంలోని రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు కాపుకాసి జాతీయ రహదారిపై వెళ్లుతున్న సైనిక ట్రక్కుపై గ్రనేడ్స్‌తో దాడి జరిపారు. ఇవి వచ్చి ట్రక్కును ఢీకోనడంతో మంటలు చేలరేగాయి. లోపలున్న సైనికులు మంటల్లో ఆహుతి అయినట్లు వెల్లడైంది. వీరు రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం జవాన్లని సైనిక వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భీంబెర్ గలీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడికి దిగారు. గ్రనెడ్ వంటి శక్తివంతమైన ఆయుధంతోనే దాడి జరిగినట్లు భావిస్తున్నట్లు సైనిక వర్గాలు ఆ తరువాత తెలిపాయి.

Also Read: పన్నీర్‌సెల్వంకు ఇసి షాక్

ఈ ప్రాంతంలో భారీ వర్షం పడుతూ ఉండటం, రోడ్లపై ముందున్నది సరిగ్గా కన్పించని పరిస్థితి ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు రెచ్చిపోయినట్లు భావిస్తున్నారు. ట్రక్కులోపల సైనికులు కొందరు బయటకు దూకినట్లు వెల్లడైంది. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో వీటిలో చిక్కుకుని ట్రక్కులోనే ఐదుగురు దగ్ధం అయినట్లు తెలిసింది. ఘటన గురించి నార్తర్న్ కమాండ్ సైనిక ప్రధాన కార్యాలయం అధికారిక ప్రకటన వెలువరించింది. ట్రక్కు పిడుగుపాటుకు గురి అయిందని దీనితో మంటలు చెలరేగాయని తొలుత వార్తలు వచ్చాయి. తరువాతి క్రమంలో ఇది ఉగ్రచర్యగా నిర్థారణ అయింది. ఈ ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలు ఉగ్రవాదుల ఏరివేత చర్యలలో ఉన్నారు. గాలింపు చర్యలలో భాగంగా సంచరిస్తుండగా దాడి జరిగింది. ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News