Monday, December 23, 2024

ఎన్‌ఐఏ కస్టడీకి ఉగ్రవాదులు

- Advertisement -
- Advertisement -

మాదన్నపేట్: చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. గత సంవత్సరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించాలని మూసారాంబాగ్‌కు చెందిన అబ్దుల్ జాహెద్ (39), సైదాబాద్‌కు చెందిన సమీయుద్దీన్ (39), మోహిదీపట్నంకు చెందిన హసన్ ఫరూక్ (29), మహ్మద్ అబ్దుల్ ఖలీమ్(39)లు కుట్రపన్నిన విషయం తెలిసింది. తెలంగాణ పోలీసులు వారి కుట్రలను భగ్నం చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

దసరా, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి మీటింగ్స్ టార్గెట్ చేసిన్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది. వీరి అకౌంట్స్‌ల్లో భారీ మొత్తం పాకిస్తాన్ నుంచి డిపాజిట్ అయిన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని కొందరి యువకులను ఐసిసి రిక్రూట్ చేసిన్నట్లు ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. ఈ మేరకు ఎన్‌ఐఏ అధికారులు రిమాండ్ ఖైదీలుగా ఉగ్రవాదులను నాలుగు రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News