Tuesday, January 21, 2025

అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

- Advertisement -
- Advertisement -

అనంతనాగ్ లార్నూ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు శనివారం మట్టుబెట్టాయి. అనంతనాగ్ ఆర్మీ జవాన్ హిలాల్ అహ్మద్ భట్ హత్యలో ఈ ఇద్దరు ఉగ్రవాదులకు ప్రమేయం ఉందని గుర్తించారు. భట్ గత అక్టోబర్ మొదటివారంలో అపహరణకు గురయ్యారు. ఆ తరువాత బులెట్లతో ఛిద్రమైన అతని మృతదేహాన్ని బలగాలు కనుగొన్నాయి. హల్కాన్ గలిలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో బలగాలు

గాలింపు చేపట్టగా రెండు వైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు స్థానికుడిగా, మరొకరిని విదేశీయుడిగా గుర్తించారు. అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన గంట తరువాత శ్రీనగర్ సిటీ లోనూ అదే తరహా ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బలగాల ఉచ్చులో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకున్నట్టు తాజా సమాచారం. శ్రీనగర్‌లో గత 30 నెలల తరువాత ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News