Sunday, November 24, 2024

పాక్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బస్సులో నుంచి దింపి ప్రయాణికులను కాల్చి చంపారు

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బస్సును ఆపి ప్రయాణికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దారుణ సంఘటన బలూచిస్తాన్‌లోని ముసాఖేల్ జిల్లాలో చోటుచేసుకుంది. ముసాఖేల్‌లోని అంతర్-ప్రాంతీయ రహదారిలో బస్సును అడ్డగించిన ముష్కరులు.. అందులోని ప్రయాణికులను కిందకు దింపి వారిని తనిఖీ చేసిన తర్వాత కాల్పులకు పాల్పడ్డారని.. ఈ ఘటనలో 23 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన వారందరూ పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు.

గతంలోనూ పంజాబ్‌కు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి సంఘటన చోటుచేసుకున్నాయి. ఏప్రిల్‌లో, ముష్కరులు నోష్కి సమీపంలో బస్సు నుండి తొమ్మిది మంది ప్రయాణికులను దించి, వారి ID కార్డులను తనిఖీ చేసిన తర్వాత కాల్చి చంపారు. మళ్లీ దాదాపు నాలుగు నెలల తర్వాత ముసాఖేల్ లో ఇలాంటి దాడి జరిగింది.

గత ఏడాది అక్టోబర్‌లోనూ బలూచిస్తాన్‌లోని కెచ్ జిల్లాలో ఉన్న టర్బాత్‌లో పంజాబ్‌కు చెందిన ఆరుగురు కార్మికులను గుర్తుతెలియని ముష్కరులు కాల్చి చంపారు. బాధితులందరూ దక్షిణ పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. వారి జాతి నేపథ్యం ఆధారంగా ముష్కరులు ఈ హత్యలు చేస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News