శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కాశ్మీరీ పండిట్ మరణించగా, అతని సోదరుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. మృతుడిని సునీల్‌కుమార్‌గా, గాయపడిన వ్యక్తిని పింటూ కుమార్‌గా పోలీసు అధికారి గుర్తించారు.
“షోపియన్‌లోని చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో ఉగ్రవాదులు పౌరులపై కాల్పులు జరిపారు. ఒకరు మరణించారు, ఒకరు గాయపడ్డారు. ఇద్దరూ మైనారిటీ వర్గానికి చెందినవారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతం దిగ్బంధించబడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది” అని పోలీసు ప్రతినిధి తెలిపారు.
#Terrorists fired upon civilians in an apple orchard in Chotipora area of #Shopian. One person died and one injured. Both belong to minority community. Injured person has been shifted to hospital. Area #cordoned off. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) August 16, 2022