Wednesday, January 22, 2025

శ్రీనగర్‌లో ఎస్‌ఐపై ఉగ్రవాదుల కాల్పులు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : స్థానిక శ్రీనగర్ ఈద్గా ప్రాంతంలో ఉగ్రవాదులు ఆదివారం రాత్రి ఓ పోలీసు అధికారిపై కాల్పులు జరిపారు. డౌన్‌టౌన్‌లోని ఈద్గా మైదానం వద్ద పోలీసు ఇన్‌స్పెక్టర్ మస్రూర్ వానీపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఈ ఇన్‌స్పెక్టర్‌ను ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించినట్లు, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఎస్‌ఐని ఉగ్రవాదులు అతి సమీపంలో నుంచి కాల్చారు. ఉగ్రవాదులు ఓ పోలీసు పిస్టల్‌ను ఈ దాడికి వాడినట్లు ప్రాధమికంగా నిర్థారణ అయింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈద్గా గ్రౌండ్‌లో ఈ ఎస్‌ఐ స్థానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా కాల్పులు జరిగినట్లు వెల్లడైంది. గాయపడ్డ పోలీసు అధికారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News