Thursday, January 23, 2025

భారత్‌లోకి టెస్లా?

- Advertisement -
- Advertisement -
ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్చలు
రూ.20 లక్షలతో మార్కెట్ లోకి  కారు

న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది. భారతీయ మార్కెట్లో రూ. 20 లక్షల ధరతో టెస్లా ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని ఈ కంపెనీ సిఇఒ మస్క్ యోచిస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలన్నది కంపె నీ లక్ష్యంగా ఉంది. చౌకైన మోడల్3 కారును భారత్ మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా భారతీయ పర్యావరణానికి, అలాగే బడ్జెట్‌కు అనుగుణంగా ఉంటుందని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. గత నెలలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎలక్ట్రిక్ వాహనా ల కోసం ఎలాన్ మస్క్‌తో సమావేశమయ్యారు. భారతదేశంలో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు టెస్లా ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. దేశంలో కంపెనీ స్వంతంగా సప్లై చైన్‌ను ఏర్పాటు చేయడం, పన్ను మినహాయింపుపై కం పెనీ భారత ప్రభుత్వంతో చర్చించింది. అయితే దేశంలో ప్రస్తుతం ఉన్న ఆటో కాంపోనెంట్ సప్లై చైన్‌ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కంపెనీకి సూచించింది.
టెస్లా చౌకైన కారు మోడల్ 3
ప్రస్తుతం నాలుగు ఎలక్ట్రిక్ టెస్లా కార్లు అమెరిక న్ మార్కెట్‌లో అమ్ముడవుతున్నాయి. వీటిలో మోడల్ ఎస్, మోడల్ 3, మోడల్ ఎక్స్, మోడల్ వై ఉన్నాయి. వాటిలో మోడల్ 3 చౌకైన కారు. అమెరికాలో దీని ధర 40,240 డాలర్లు (దాదాపు రూ.33 లక్షలు). ఈ కారు ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 535 కిలోమీటర్లు నడుస్తుంది. భారత్‌లోకి ఈ మోడల్ దిగుమతితో పన్నుల కారణంగా ధర రూ.60 నుంచి 66 లక్షల శ్రేణికి చేరుతుంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ సౌమెన్ మండల్ మాట్లాడుతూ, స్థానికంగా ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా దిగుమతి సుంకం తొలగిపోతుంది, దీంతో 40,240 డాలర్ల (రూ.33 లక్షల)కు గాను 24,366 డాలర్ల(రూ.20 లక్షలు) కూడా సుదూర కల అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News