Friday, December 20, 2024

80 వేల కార్లను రీకాల్ చేసిన టెస్లా

- Advertisement -
- Advertisement -

బీజింగ్: 2013నుంచి చైనాలో తయారై దిగుమతి చేసుకున్న 80వేల కార్లను టెస్లా రీకాల్ చేసింది. సాఫ్ట్‌వేర్, సీటుబెల్టు సమస్యలు తలెత్తడంతో 80వేల కార్లను రీకాల్ చేసినట్లు చైనీస్ మార్కెట్ రెగ్యులేటర్ ప్రకటనలో తెలిపింది. యూఎస్ కేంద్రంగా ఉన్న ఎలక్ట్రిక్ కారు తయారీ సంస్థ మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను రీకాల్ చేసింది. ఇవి 25సెప్టెంబర్ 2013 నుంచి 2020 మధ్య చైనా నుంచి దిగుమతి అయ్యాయి.

ఈ కార్లలో సాఫ్ట్‌వేర్ సమస్యలు, బ్యాటరీ నిర్వహణ వ్యవస్థలో సమస్యలు తలెత్తాయి. దీంతో రీకాల్ చేసిన కార్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు టెస్లా తెలిపింది. అదేవిధంగా జనవరి నవంబర్ 2019లో తయారైన మోడల్ 3కార్లను కూడా టెస్లా రీకాల్ చేసింది. చైనాలో 14అక్టోబర్ 2019నుంచి 2022లో తయారైన ఇదే మోడల్ కార్లు 10,127 కార్లను టెస్లా రీకాల్ చేసింది. సీట్ బెల్టు అమరికలో ఏర్పడిన సమస్యను పరిశీలించి రీఇన్‌స్టాల్ చేయనున్నట్లు టెస్లా తెలిపింది. కాగా టెస్లా మొత్తం మోడల్ 3కార్లను సెమీకండక్టర్ కాంపోనెంట్స్‌లో సమస్యలు కారణంగా రీకాల్ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News