Friday, December 20, 2024

భారత్‌లో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు టెస్లా సీరియస్‌గా ప్రయత్నాలు

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్

న్యూఢిల్లీ : భారతదేశంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని అమెరికా ఇవి దిగ్గజం టెస్లా తీవ్రంగా యోచిస్తోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం తర్వత మరుసటి రోజు మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి రాయితీలు, బ్యాటరీ ఉత్పత్తి వంటి వివిధ అంశాలపై భారతీయ అధికారులతో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ సిబ్బంది చర్చలు జరిపింది. భారతదేశం మార్కెట్లోకి ప్రవేశించేందుకు టెస్లా మరోసారి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని రైటర్స్ నివేదిక పేర్కొంది. భారత ప్రభుత్వం టెస్లాతో కలిసి పనిచేసేందుకు సంకేతాలు ఇచ్చిందని, పెట్టుబడుల విషయంలో భారత్ లక్ష్యాలను వివరించిందని చంద్రశేఖరన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News