Tuesday, September 17, 2024

టెస్లాకు షాక్

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ విద్యుత్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లాలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న భారత సంతతి అమెరికన్ శ్రీలా వెంకటరత్నం కంపెనీలో నుంచి వైదొలిగారు. ఆమె 2013 నుంచి సంస్థలో పలు హోదాల్లో సేవలు అందించారు. సుదీర్ఘ విరామం అనంతరం టెస్లా కంపెనీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఆమె తెలిపారు. కుటుంబంతోను, స్నేహితులతోను సరదాగా గడిపేందుకు మాత్రమే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. శ్రీలా వెంకటరత్నం తన రాజీనామా లేఖను లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. శ్రీలా వెంకటరత్నం 2013లో టెస్లాలో చేరారు. ఆమె తొలుత ఫైనాన్స్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, తదుపరి సీనియర్ డైరెక్టర్ హోదా పొందారు. ఆమె 2019 నుంచి 2024 వరకు సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

కొంత కాలం విరామం తీసుకున్న తరువాత కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తానని ఆమె తెలిపారు. శ్రీలా వెంకటరత్నం చేరిన తరువాతే టెస్లా 700 బిలియన్ డాలర్ల సంస్థగా అవతరించింది. తన ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించానని ఆమె తెలిపారు. తన సహచర ఉద్యోగుల సహకారాన్ని తాను ఎన్నటికీ మరువలేనని ఆమె తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగ్గురు డైరెక్టర్లు టెస్లాకు గుడ్‌బై చెప్పారు. తాజాగా సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీలా వెంకటరత్నం రాజీనామా చేశారు. ఇప్పటి వరకు సంస్థలో వైస్ ప్రెసిడెంట్లుగా ఉన్న ఇద్దరిలో శ్రీలా వెంకటరత్నం ఒకరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News