Friday, December 20, 2024

భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తే టెస్లా లాభపడుతుంది: నితిన్ గడ్కరీ

- Advertisement -
- Advertisement -

 

Gadkari

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘టెస్లా’ తమ ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌లో తయారు చేస్తే కంపెనీకి కూడా లాభాలు వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం అన్నారు.
ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ, దేశంలోని పెట్రోల్ వాహనాల ధర కంటే అన్ని ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తక్కువగా ఉండే రోజులు ఎంతో దూరంలో లేవని గడ్కరీ అన్నారు. “అగర్ టెస్లా ఇండియా మే ఎలక్ట్రిక్ కార్ మాన్యుఫ్యాక్చరింగ్ కరేగాతో ఉన్ కా భీ ఫాయిదా హోగా (టెస్లా తన ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలో తయారు చేస్తే, వారు కూడా ప్రయోజనాలను పొందుతారు)” అని గడ్కరీ చెప్పాడు.

ఇంతకుముందు ఏప్రిల్ 26న,  గడ్కరీ మాట్లాడుతూ, టెస్లా తన ఇవిలను భారతదేశంలో తయారు చేయడానికి సిద్ధంగా ఉంటే, సమస్య కాబోదు, కానీ ఆ కంపెనీ చైనా నుండి కార్లను దిగుమతి చేసుకోకూడదు.”ఒకవేళ ఎలన్ మస్క్ (టెస్లా సిిఇఓ) భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంటే, ఎటువంటి సమస్య లేదు … భారతదేశానికి రండి, తయారీ ప్రారంభించండి, భారతదేశం ఒక పెద్ద మార్కెట్, వారు భారతదేశం నుండి ఎగుమతి చేయవచ్చు,” అని అతడు రైసినా డైలాగ్ ఈవెంట్ లోని ఒక ఇంటరాక్టివ్ సెషన్‌లో చెప్పాడు. గత సంవత్సరం, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ టెస్లాను పన్ను రాయితీలను పరిగణనలోకి తీసుకునే ముందు భారతదేశంలో తన ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించాలని కోరింది. ప్రస్తుతం, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్లు (సిబియులు)గా దిగుమతి చేసుకున్న కార్లు ఇంజన్ పరిమాణం మరియు ధర, బీమా మరియు సరుకు (సిఐఎఫ్) ఆధారంగా విలువ 40,000 అమెరికా డాలర్ల కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువకు 60-100 శాతం వరకు కస్టమ్స్ సుంకం పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News