Thursday, January 9, 2025

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్: రెండో స్థానానికి టీమిండియా..

- Advertisement -
- Advertisement -

దుబాయి: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా రెండో స్థానానికి చేరుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన దక్షిణాఫ్రికా మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 76.92 శాతం (120 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది.

భారత్ 55.77 శాతంతో రెండో స్తానానికి చేరుకుంది. భారత్ ప్రస్తుతం 72 పాయింట్లు సాధించింది. ఇక దక్షిణాఫ్రికా 64 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక, ఇంగ్లండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News