Wednesday, January 22, 2025

ప్రీతి శరీరంలో విష రసాయనాల ఆనవాళ్లు లేవు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మెడికో ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ లో విషపదార్థాలు డిటెక్ట్ కా లేదని, ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాల ఆనవాళ్లు లేవని టాక్సికాలజీ రిపోర్ట్‌లో వెల్లడైంది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో విషపదార్థాల ఆనవాళ్లు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ పేర్కొంది. టాక్సికాలజీ రిపోర్ట్ వరంగల్ సీపీ రంగనాథ్‌కు చేరింది. ప్రీతి ది హత్యా, ఆత్మహత్యా అనేది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చేపనిలో పోలీసులు ఉన్నారని, హత్యే అని ప్రీతి కుటుంబసభ్యులు, విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
కీలకంగా మారనున్న జూనియర్ వాంగ్మూలం
తెలంగాణలో సంచలనంగా మారిన మెడికో ప్రీతి కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే యాంటీ ర్యాగింగ్ కమిటీ, పోలీసులు విచారణ ముమ్మరం చేయగా జూనియర్ మెడికల్ విద్యార్థి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. దీంతో ఈ వాంగ్మూలం కీలకంగా మారనుంది. పోలీస్ విచారణ, యాంటీ ర్యాగింగ్ కమిటీలో కీలక జూనియర్ మెడికల్ విద్యార్థి కీలక విషయాలను బయట పెట్టినట్టు తెలుస్తోంది. ప్రీ అనస్థీషియా రిపోర్ట్ వివాదంలో డాక్టర్ సైఫ్ చెప్పిన అభిప్రాయానికి భిన్నమైన విషయాలను జూనియర్ మెడికల్ విద్యార్థి వెల్లడించినట్టు సమాచారం. ఫ్రీ అనస్థీషియా రిపోర్ట్ (పిఎసి) విషయంలో సైఫ్ ఫిజికల్‌గా లేకున్నా ప్రీతిని బ్లేమ్ చేసినట్టు నిర్ధారించారు.

జిఎంహెచ్‌లో జూనియర్ విద్యార్థినికి డిక్టేట్ చేస్తూ పిఎసి రిపోర్ట్‌ని డాక్టర్ ప్రీతి ఫైండింగ్స్‌లో పొందుపరిచినట్లు విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది.డాక్టర్ సైఫ్ తనను కావాలని వేధిస్తున్నాడని, పిఎసి రిపోర్ట్ వివాదం వివరించి తనకు సపోర్ట్ చేయాలని ప్రీతి అర్థించినట్టు జూనియర్ మెడికల్ విద్యార్థి వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. తనపై కుట్ర జరుగుతోందని ప్రీతి తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయినట్టు జూనియర్ మెడికల్ విద్యార్థి తెలిపింది. ఇదే విషయమై లాస్ట్ కాల్‌లో సహ విద్యార్థితో తన ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది.

జూనియర్ మెడికల్ విద్యార్థి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న విచారణ బృందం మెడికో ప్రీతి చివరి కాల్‌పై పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తోంది. పిఎసి రిపోర్ట్ విషయంలో నిందితుడు డాక్టర్ సైఫ్ వాదన అవాస్తవమని పోలీస్ విచారణలో తెలుస్తోంది. డాక్టర్ సైఫ్, డాక్టర్ ప్రీతి మధ్య వివాదంగా మారిన ప్రశ్నించే తత్వం, దానికి సంబంధించిన చాట్స్ కూడా లభ్యమైనట్టు సమాచారం. మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలను బేస్ చేసుకుని పోలీసు అధికారులు కేసులో ముందుకెళ్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News