ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిజి టెట్ 2025) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం(ఏప్రిల్ 15) ప్రారంభం కానున్నది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యా అధికారిక వెబ్ సైట్ http://schooledu.telanganga.gov.inలో మరింత సమాచారం పొందవచ్చు. టెట్ పేపర్-1కు డి.ఇడి, పేపర్ -2కు బి.ఇడి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఈ నెల 11వ తేదీన టెట్ నోటిఫికేషన్ విడులైన విషయం తెలిసిందే. జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు టెట్ పరీక్షలు నిర్వహించనుండగా, జూన్ 9 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. జులై 22న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
రేపటి నుంచి టెట్ దరఖాస్తులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -